
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం మిక్స్డ్ రివ్యూస్ తో ఓపెన్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ బాగానే తెచ్చుకుంది. అయితే కంటెంట్ లో కంప్లైంట్స్ ఉండడంతో దర్బార్ కలెక్షన్స్ నెమ్మదించడం మొదలెట్టింది. ఇక దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు విడుదలవడంతో దర్బార్ కలెక్షన్స్ కు పూర్తిగా గండిపడింది. 8 రోజులకు గాను ఈ చిత్రం 9.30 కోట్ల షేర్ ను సాధించింది. కనుమ రోజు హాలిడే అయినా కానీ కేవలం 40 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక హాలిడేస్ పూర్తవ్వడంతో దర్బార్ కలెక్షన్స్ మరింత తగ్గుముఖం పట్టనున్నాయి. మొత్తంగా ఫుల్ రన్ లో దర్బార్ 11 కోట్ల షేర్ ను సాధించి యావరేజ్ గా నిలవనుంది.
దర్బార్ 8 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
నైజాం :Rs 4.69 Cr
సీడెడ్ : Rs 1.03 Cr
గుంటూరు : Rs 0.67 Cr
వైజాగ్ : Rs 1.00 Cr
ఈస్ట్ గోదావరి : Rs 0.61 Cr
వెస్ట్ గోదావరి : Rs 0.42 Cr
నెల్లూరు : Rs 0.37 Cr
కృష్ణ : Rs 0.51 Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 9.30 Cr షేర్స్
ముంబై కమిషినర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీకాంత్ నటన అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. అయితే రజినీ మ్యానరిజమ్స్ ఆకట్టుకున్నా కథలో సత్తా లేకపోవడం దర్బార్ కు నెగటివ్ గా మారింది. దర్బార్ లో నయనతార హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ రజినీ కూతురు పాత్రలో కనిపించింది.