Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై అప్డేట్ ఇస్తోన్న బాలీవుడ్ మీడియా

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై అప్డేట్ ఇస్తోన్న బాలీవుడ్ మీడియా

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై అప్డేట్ ఇస్తోన్న బాలీవుడ్ మీడియా
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై అప్డేట్ ఇస్తోన్న బాలీవుడ్ మీడియా

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం గత మూడేళ్ళ నుండి చిత్రీకరణ దశలోనే ఉండి ఎన్నో అడ్డంకులను దాటుకుని మొత్తానికి షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయని రాజమౌళి ఇటీవలే వెల్లడించాడు.

ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆర్ ఆర్ ఆర్ ను అక్టోబర్ 13 విడుదల చేద్దామనుకున్నా కానీ అది సాధ్యపడలేదు. థియేటర్లు ప్రపంచమంతటా ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆర్ ఆర్ ఆర్ టీమ్ అంది. ఎప్పటికప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

- Advertisement -

తాజాగా బాలీవుడ్ మీడియా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ ఇదేనంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. వారి ప్రకారం ఆర్ ఆర్ ఆర్ జనవరి 12, 2022న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న పెన్ స్టూడియోస్ తమ డిస్ట్రిబ్యూటర్లకు ఈ విషయాన్ని తెలిపారట. ఒకవేళ  ఇదే కనుక జరిగితే సంక్రాంతికి వస్తోన్న భారీ తెలుగు చిత్రాలకు ఇబ్బంది వచ్చినట్లే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All