
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కానీ, తన భార్య ఉపాసనకు కానీ జంతువులు అంటే అమితమైన ఆసక్తి. రామ్ చరణ్ కు ఇప్పటికే మూడు గుర్రాలు ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. చరణ్ కు కుక్కలంటే కూడా చాలా ఇష్టం. ఇప్పటికే తన వద్ద కుక్కలు ఉండగా లేటెస్ట్ గా మరో కుక్కపిల్లను తన ఇంట్లోకి ఆహ్వానించాడు.
దానికి రైమ్ అని పేరు కూడా పెట్టాడు. రామ్ చరణ్ దాన్ని భుజాన ఎక్కించుకుని ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రత్యేకంగా క్యాప్షన్ అంటూ ఏం పెట్టలేదు కానీ లవ్ సింబల్స్ పెట్టాడు. ఈ కుక్కపిల్ల చూడటానికి భలే ముద్దుగా ఉంది. మొత్తం ఫర్ తో క్యూట్ క్యూట్ గా ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాలను పూర్తి చేసాడు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా లాంచ్ అయింది. ఆ సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. వచ్చే నెల నుండి షూటింగ్ మొదలవుతుంది. కియారా అద్వానీ కథానాయిక.