Homeటాప్ స్టోరీస్టీజ‌ర్ ఫైన‌ల్ క‌ట్‌కి క‌స‌ర‌త్తు మొద‌లైంది!

టీజ‌ర్ ఫైన‌ల్ క‌ట్‌కి క‌స‌ర‌త్తు మొద‌లైంది!

టీజ‌ర్ ఫైన‌ల్ క‌ట్‌కి క‌స‌ర‌త్తు మొద‌లైంది!
టీజ‌ర్ ఫైన‌ల్ క‌ట్‌కి క‌స‌ర‌త్తు మొద‌లైంది!

జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేసింది. అదే త‌ర‌హాలో `ఆర్ ఆర్ ఆర్‌` చిత్ర బృందం మ‌రో టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతోంది. ఈ నెల 20న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ రోజు కోసం ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ టీజ‌ర్‌కు సంబంధించిన ఫుటేజ్ కావాల్సినంత‌గా లేక‌పోవ‌డంతో జ‌క్క‌న్న ముందు టీజ‌ర్ క‌ష్ట‌మ‌నే సంకేతాల్ని అందించాడు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గుర‌య్యారు. తాజాగా నిర్మాత దాన‌య్య ఎన్టీఆర్ బ‌ర్త్‌డే గిఫ్ట్  రెడీ అవుతోందంటూ వెల్ల‌డించ‌డంతో ఫ్యాన్స్‌లో ఎక్క‌డ లేని ఆనందం మొద‌లైంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కావ‌డంతో టీమ్ అంతా ఒక్కోక‌రు ఒక్కో చోట వుంటూ టీజ‌ర్ కోసం క‌స‌ర‌త్తు చేస‌క్తున్నారు.

- Advertisement -

అయితే ఫైన‌ల్ క‌ట్ విష‌యంలో కొంత క‌న్ఫ్యూజ‌న్ న‌డుస్తోంద‌ని, ఇప్ప‌టికే రెండు మూడు వెర్ష‌న్‌లు సిద్ధం చేసిన చిత్ర బృందం ఫైన‌ల్ క‌ట్ ఓకే కోసం ఎదురుచూస్తున్నార‌ట‌. రాజ‌మౌళి ఫైన‌ల్ చేస్తే త‌ప్ప టీజ‌ర్ ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో జ‌క్క‌న్న పిలుపు కోసం ఎదురుచూస్తున్నార‌ట‌. అంతా ఫైన‌ల్ అయితే 18నే టీజ‌ర్ రిలీజ్‌కి సంబంధించిన అఫీష‌య‌ల్ అనౌన్స్‌మెంట్ వుంటుంద‌ని వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All