Homeటాప్ స్టోరీస్జ‌క్క‌న్న‌లో నెగెటివ్స్ ఏంటో బ‌య‌ట‌పెట్టేశాడు!

జ‌క్క‌న్న‌లో నెగెటివ్స్ ఏంటో బ‌య‌ట‌పెట్టేశాడు!

జ‌క్క‌న్న‌లో నెగెటివ్స్ ఏంటో బ‌య‌ట‌పెట్టేశాడు!
జ‌క్క‌న్న‌లో నెగెటివ్స్ ఏంటో బ‌య‌ట‌పెట్టేశాడు!

జ‌క్క‌న్న‌.. తెలుగు సినిమా స్థాయిని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు. `బాహుబ‌లి`కి ముందు. త‌రువాత తెలుగు సినిమా అనే స్థాయిలో మార్పుని తెచ్చిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క‌ల‌యిక‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‌`ఆర్ఆర్ఆర్‌`. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్‌ 75 శాతం పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వాయిదా వేశారు. లాక్ డౌన్ పూర్త‌యిన త‌రువాత ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఈ సినిమా షూటింగ్ ఆధార‌ప‌డి వుంది. ఇదిలా వుంటే లాక్‌డౌన్ కార‌ణంగా సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేక్ష‌కుల‌తో మాట్లాడ‌టానికి లైవ్‌లోకి వ‌చ్చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన లైవ్ ప్రోగ్రామ్‌లో త‌మ్ముడు రాజ‌మౌళి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి షాకిచ్చారు. త‌న కుటుంబ స‌భ్యుల్లో న‌చ్చిన విష‌యాలు న‌చ్చ‌ని విష‌యాలు వెల్ల‌డించిన కీర‌వాణి ప‌నిలో ప‌నిగా రాజ‌మౌళిలో త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాల‌పై వెల్ల‌డించారు. ఒక ప‌ని మొద‌లుపెడితే చివ‌రి వ‌ర‌కు దానిపైనే ఏకాగ్ర‌త‌తో వుంటాడ‌ని, మ‌ధ్యో డీవేట్ అవ్వ‌డ‌ని చెబుతూనే నెగెటివ్ విష‌యాల్ని కూడా బ‌య‌ట‌పెట్టారు. రాజ‌మౌళి ఎక్కువ‌డ‌గా చిన్ని పిల్ల‌ల సినిమాలు చూస్తుంటాడ‌ని, ఏవైనా మెచ్చూర్డ్ సినిమాలు చూద్దామంటే మాతో క‌ల‌వ‌డ‌ని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All