Homeగాసిప్స్రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చేది అప్పుడేనా?

రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చేది అప్పుడేనా?

రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చేది అప్పుడేనా?
రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చేది అప్పుడేనా?

`బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`.  డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో.., యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌లో దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా మిగ‌తా భాగం చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది.

మూడు నెల‌ల పాటు చిత్రీక‌ర‌ణ ఆగిపోవ‌డంతో ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా మా‌రిన‌ట్టు తెలిసింది. ముందు ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. త‌రువాత అదే డేట్‌ని మారుస్తూ 2021 జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. తాజాగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆ డేట్ కూడా మారిన‌ట్టు తెలుస్తోంది. మూడు నెల‌ల పాటు షూటింగ్ నిలిచిపోవ‌డంతో అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేయ‌డం అసాధ్యంగా మారింది.

- Advertisement -

దీంతో మేక‌ర్స్ ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జూలై 30న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. హైద‌రాబాద్‌తో పాటు యావ‌త్ ఇండియా మొత్తం క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేథ్యంలో స్టార్స్ ఎవ‌రూ షూటింగ్‌కి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టంలేద‌ట‌. దీంతో మ‌రో మూడు నెల‌ల పాటు `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్ వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, ఆకార‌ణంగానే రాజ‌మౌళి మరోసారి ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని మార్చాల‌నుకుంటున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All