Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్స్ పై పూర్తి క్లారిటీ ఇచ్చిన జక్కన్న

ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్స్ పై పూర్తి క్లారిటీ ఇచ్చిన జక్కన్న

ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్స్ పై పూర్తి క్లారిటీ ఇచ్చిన జక్కన్న
ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్స్ పై పూర్తి క్లారిటీ ఇచ్చిన జక్కన్న

ఎస్ ఎస్ రాజమౌళి నుండి సినిమా వస్తోందంటే టాలీవుడ్ మొత్తం ఎదురుచూసే పరిస్థితి దాటిపోయి యావత్ భారతదేశం ఎంతో ఆసక్తితో ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అంతలా తన సినిమాలతో మ్యాజిక్ చేస్తుంటాడు రాజమౌళి. బాహుబలి తర్వాత అంతకుమించిన సినిమా జక్కన్న తీయలేడేమో అనిపించింది.

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా మొదలుపెట్టాడు రాజమౌళి. పీరియాడిక్ కథాంశానికి ఫిక్షనల్ స్టోరీను జతచేసి ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ఈ చిత్రానికి పూర్తైన విషయం తెల్సిందే. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా ప్రభావం వల్ల షూటింగ్ జరగనే లేదు.

- Advertisement -

ప్రస్తుతం సినిమాలు అన్నీ నెమ్మదిగా షూట్ మోడ్ లోకి వెళుతున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ నెలలోనే షూటింగ్ మొదలుకావొచ్చన్న సంకేతాలు ఇచ్చాడు. “హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని తక్కువ మందితోనే షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసాం.

ఇప్పటికే దీనిపై చాలా చర్చించాం. త్వరలోనే షూటింగ్ ఉంటుంది. షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేను. ప్రత్యేకమైన పద్దతులతో షూటింగ్ చేస్తున్నాం.” అని రాజమౌళి అన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All