Homeటాప్ స్టోరీస్తార‌క్‌, చెర్రీ‌ల‌కు ఛాలెంజ్ విసిరిన జ‌క్క‌న్న‌!

తార‌క్‌, చెర్రీ‌ల‌కు ఛాలెంజ్ విసిరిన జ‌క్క‌న్న‌!

తార‌క్‌, చెర్రీ‌ల‌కు ఛాలెంజ్ విసిరిన జ‌క్క‌న్న‌!
తార‌క్‌, చెర్రీ‌ల‌కు ఛాలెంజ్ విసిరిన జ‌క్క‌న్న‌!

కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ఇంటి ప‌ట్టునే వుంటూ త‌మ‌కు తోచిన ప‌నుల్లో బిజీ అయిపోయారు. ఈ సంద‌ర్భంగా `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు బీద మెన్ ఛాలెంజ్ అంటూ త‌న శ్రీ‌మ‌తికి ఇంటి ప‌నుల్లో సాయం చేస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేసి త‌న‌లాగే చేయాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఆదివారం ఛాలెంజ్ విసిరారు.

ద‌న్ని స్వీక‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన జ‌క్క‌న్న సోమ‌వారం త‌న వీడియోని అప్‌లోడ్ చేస్తాన‌ని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్ర‌కార‌మే త‌న స‌తీమ‌ణి ర‌మకు ఇంటి ప‌నుల్లో సాయం చేశారు. ఫ్లోర్‌ని శుభ్రం చేశారు. డోర్స్ క్లీన్ చేశారు. చెప్పిన మాట ప్ర‌కార‌మే మెగా మైక్ ప‌ట్టుకుని యాక్ష‌న్ చెప్పిన జ‌క్క‌న్న చీపురు ప‌ట్టారు. శ్రీ‌మ‌తికి సాయంగా నిలిచారు.

- Advertisement -

సందీప్ వంగ ఛాలెంజ్‌కి త‌గ్గ‌ట్టుగా వీడియోని షేర్ చేసిన రాజ‌మౌళి.. టాస్క్ పూర్తి చేశాను. తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు శోభూ యార్ల‌గ‌డ్డ‌, కీర‌వాణి, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విసురుతున్నాను` అని ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All