Homeటాప్ స్టోరీస్రాజ‌మౌళి ఎవ‌రికి ఛాలెంజ్ విస‌ర‌బోతున్నారు?

రాజ‌మౌళి ఎవ‌రికి ఛాలెంజ్ విస‌ర‌బోతున్నారు?

రాజ‌మౌళి ఎవ‌రికి ఛాలెంజ్ విస‌ర‌బోతున్నారు?
రాజ‌మౌళి ఎవ‌రికి ఛాలెంజ్ విస‌ర‌బోతున్నారు?

దేశ వ్యాప్తంగా క‌రోనా  విళ‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో ఈ నెల 14న ఎత్తేయాల్సిన లాక్‌డౌన్‌ని మే 3 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా పొడిగించారు. అయితే తెలంగాణ‌లో మాత్రం దీన్ని మే 7 వ‌ర‌కు విధించ‌డంతో అంతా ఇంటికే ప‌రిమితం కావాల్స‌న పరిస్తితి. ఇదిలా వుంటే ఈ నిర్భంత స‌మ‌యాన్ని ఒక్కొక్క సెల‌బ్రిటీ ఒక్కోలా వినియోగిస్తున్నారు.

ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ త‌న భార్యామ‌ణి కోసం వంట మాస్ట‌ర్‌గా మారి వంట చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే త‌ర‌హాలో `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్ వంగ స‌రికొత్త ఛాలెంజ్ విసిరారు. నిజ‌మైన పురుషుడు ఈ క్వారెంటైన్ వేళ ఇంటి మ‌హిళ‌తో ప‌ని చేయించ‌డ‌ని, క్వాంరెంటైన్ టైమ్‌లో ప‌నిమ‌నిషి రాన‌ప్పుడు
ఇంటి మ‌హిళ‌తో ప‌ని చేయించ‌డు `బీద రియ‌ల్ మెన్` అని ట్వీట్ చేసిన సందీప్ వంగ ఇంటి ప‌ని చేసిన ఓ వీడియోని షేర్ చేయ‌డ‌మే కాకుండా అలాంగి వీడియోనే రాజ‌మౌళి కూడా చేసి షేర్ చేయాల‌ని ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -

సందీప్ వంగ ఛాలెంజ్‌ని అంగీక‌రించిన రాజ‌మౌళి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సందీప్ అని పోస్ట్ చేశారు. దీంతో జ‌క్క‌న్న క్వారెంటైన్ వేళ సందీప్‌కి ఎలాంటి వీడియోతో స‌మాధానం చెప్ప‌బోతున్నాడో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ‌మౌళి ఎవ‌రికి ఛాలెంజ్ విస‌ర‌బోతున్నార‌న్నది మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All