Homeటాప్ స్టోరీస్రాజ రాజ చోర మూవీ రివ్యూ

రాజ రాజ చోర మూవీ రివ్యూ

Raja Raja Chora Movie review
Raja Raja Chora Movie review

దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాతలు: విశ్వ ప్రసాద్ టిజి, అభిషేక్ అగర్వాల్
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్
తారాగణం: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా తదితరులు
విడుదల తేదీ: ఆగస్ట్ 19, 2021
రేటింగ్ : 3/5

టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర. శ్రీ విష్ణు ఈ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపాడు. మరి అది నిజమో కాదో చూద్దాం.

కథ:

భాస్కర్ (శ్రీ విష్ణు) ఒక చిన్నపాటి దొంగ. దొంగతనాలతో పాటు ఒక జెరాక్స్ షాప్ లో కూడా పనిచేస్తుంటాడు భాస్కర్. అయితే సంజన (మేఘా ఆకాష్)ను ప్రేమించే భాస్కర్ తనకోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని బిల్డప్ ఇస్తాడు. కానీ అసలు ట్విస్ట్ సంజనకు వస్తుంది. భాస్కర్ కు అప్పటికే పెళ్లి అయినట్లు, ఒక కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

మరి భాస్కర్ కు నిజంగానే పెళ్లయిందా? భాస్కర్ ఈ విషయంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటి? అన్నది తెరమీదే చుడాలి.

- Advertisement -

నటీనటులు:
శ్రీ విష్ణు సూపర్బ్ నటన కనబర్చాడు. రాజ రాజ చోర విషయంలో మెయిన్ హైలైట్ గా నిలిచింది శ్రీ విష్ణు పాత్ర. చాలా సులువుగా ఈ రోల్ ను చేసుకుని వెళ్ళిపోయాడు భాస్కర్. శ్రీ విష్ణు తనలోని కామెడీ ఈజ్ ను ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు. ఇక లా స్టూడెంట్ గా సునైనా కూడా బాగానే చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ తక్కువ. ఇక మేఘా ఆకాష్ కు భిన్నమైన రోల్ వచ్చింది. ఆమె కూడా సినిమాకు ప్లస్ అయింది. రవిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ళ భరణి తదితరులు ఈ సినిమాలో మెప్పించారు.

సాంకేతిక విభాగం:
రాజ రాజ చోర కథ కొత్తగా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడే సగం విజయం సాధించాడు యువ దర్శకుడు హసిత్ గోలి. వివేక్ సాగర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించాయి. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా హసిత్ మంచి మార్కులే వేయించుకుంటాడు.

చివరిగా:
రాజ రాజ చోర ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ పరంగా హైలైట్ గా నిలుస్తుంది ఈ చిత్రం. సెకండ్ హాఫ్ లో కొంత ఎమోషనల్ గా సాగినా, కొంత సాగతీత అనిపించినా చివరికి రాజ రాజ చోర మెప్పిస్తుంది. మొత్తంగా ఈ సినిమా ఒకసారి హ్యాపీగా చూసుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All