
డిఫెరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గ నిలుస్తున్నాడు శ్రీ విష్ణు. తన కెరీర్ లో ఎక్కువగా భిన్నమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన శ్రీవిష్ణు నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర. ఆగస్ట్ 19, 2021న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది. థియేటర్లలో డీసెంట్ బిజినెస్ చేసిన రాజ రాజ చోర ఇటీవలే ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది.
ప్రస్తుతం జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ కంటే ఓటిటిలో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ సమయంలో ఇంకా కరోనా భయాలతో చాలా మంది థియేటర్లకు రావడానికి సాహసించలేదు. పైగా ఏపీలో థియేటర్లపై ఉన్న ఆంక్షల కారణంతో ఎక్కువ మంది చూడలేకపోయారు.
అయితే జీ5 లో ఈ చిత్రాన్ని చూసిన వారందరూ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. శ్రీవిష్ణు సినిమాల ఎంపిక విషయంలో మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడని పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మేఘా ఆకాష్, సునైనాలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హసిత్ గోలి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. రాజ రాజ చోర శ్రీవిష్ణు కెరీర్ లో మరో మంచి చిత్రంగా నిలిచింది.