Tuesday, February 7, 2023
Homeటాప్ స్టోరీస్జూలై 31న `జీ5లో సైకో థ్రిల్ల‌ర్ `మేక సూరి`!

జూలై 31న `జీ5లో సైకో థ్రిల్ల‌ర్ `మేక సూరి`!

జూలై 31న `జీ5లో సైకో థ్రిల్ల‌ర్ `మేక సూరి`!
జూలై 31న `జీ5లో సైకో థ్రిల్ల‌ర్ `మేక సూరి`!

డిజిట‌ల్ మాధ్య‌మం `జీ5` మిగా ఓటీటీల‌కు భిన్నంగా స‌రికొత్త వెబ్ సిరీస్‌ల‌కు వేదిక‌గా మారుతోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో వ‌చ్చిన ఒరిజిన‌ల్ తెలుగు సిరీస్ `గాడ్` (గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి). వెబ్ సిరీస్ ల‌వ‌ర్స్‌ని ఇశేషంగా ఆక‌ట్టుకుంది. ఇదే జాన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో వెబ్ సిరీస్ `ఆటో శంక‌ర్‌` ఆడియ‌న్స్ నుంచి మంచి ఆద‌ర‌ణ ని సొంతం చేసుకుంది. చెన్నైలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌న‌ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించారు. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా అద్భుత‌మైన వెబ్ సిరీస్‌ల‌ని అందిస్తూ జీ5 ప్ర‌శంసలు అందుకుంటోంది.

- Advertisement -

తాజాగా జీ5లో మ‌రో వెబ్ సిరీస్ ఈ నెలాఖ‌రున రిలీజ్ కాబోతోంది.  ర‌జ‌నీకాంత్‌, ఐశ్వ‌ర్యారాయ్ జంట‌గా న‌టించిన `రోబో` చిత్రాన్ని నార్త్ ఇండియాలో డిస్ట్రీబ్యూట్ చేయ‌డంతో పాటు శంక‌ర్ తెర‌కెక్కించిన `న‌న్బ‌న్‌` (తెలుగులో స్నేహితుడు) సినిమాకు అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్ల కు చెందిన సింబా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ `మేక సూరి`. ఈ సిరీస్‌తో వెబ్ వ‌ర‌ల్డ్‌లోకి కార్తీక్ కంచెర్ల ప్ర‌వేశిస్తున్నారు. థియేట‌ర్ ఆర్టిస్ట్‌లు సుమ‌య‌, అభిన‌య్‌ను కీల‌క పాత్ర‌ల్లో ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన వెబ్ సిరీస్ `మేక‌సూరి`.  మోస‌గాళ్ల‌కు మోస‌గాడు, ఒక్క‌క్ష‌ణం, వంటి చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా, `బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి` చిత్రానికి అసిస్టెంట్ రైట‌ర్‌గా ప‌నిచేసిన త్రినాథ్ వెలిసెల ఈ వెబ్ సిరీస్‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. టు పార్ట్స్‌గా రానున్న `మేక సూరి` తొలి పార్ట్ ఈ నెల 31న `జీ5`లో స్ట్రీమింగ్ కానుంది.

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్ద‌లు. అందులో సూరిది క‌సాయి ( మేక తోలు వ‌లిచి మాంసం అమ్మే వృత్తి) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాలు వున్న సూరి. అంద‌మైన అమ్మాయి రాణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఊరిలో వున్న ప్ర‌తీ ఒక్క‌రి మ‌న‌సు దోచే అంద‌గ‌త్తే రాణి దారుణ హ‌త్య‌కు గుర‌వుతుంది. రాణిని హ‌త్య చేసింది ఎవ‌రు? వారిపై మేక సూరి ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు అన్న‌ది `జీ5`లో చూడాల్సిందే. సైనా ఛాయాగ్ర‌హ‌ణం, ప్ర‌జ్వ‌ల్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts