Homeటాప్ స్టోరీస్ఆ విషయంలో శ్రీ విష్ణు తప్పు చేశాడా?

ఆ విషయంలో శ్రీ విష్ణు తప్పు చేశాడా?

ఆ విషయంలో శ్రీ విష్ణు తప్పు చేశాడా?
ఆ విషయంలో శ్రీ విష్ణు తప్పు చేశాడా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ సామెత ఎవరికి వర్తించినా వర్తించకపోయినా సినిమా వాళ్లకు మాత్రం సరిగ్గా వర్తిస్తుంది. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఇండస్ట్రీ ఇది. ఈ శుక్రవారం కింగ్ లా ఉండే ఒకడు.. తర్వాత మరో శుక్రవారానికి ప్లాప్ రుచి చూడవచ్చు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టే తమ హవా ఉన్న రోజుల్లోనే బాగా సంపాదించాలి అని ప్రతి సినిమా వాడు కోరుకుంటాడు. నిజానికి ఇందులో తప్పు లేదు కూడా. ఒక సినిమా హిట్ అవ్వడం ఆలస్యం, పారితోషికాలు పెరిగిపోతాయి. అది కేవలం హీరో, హీరోయిన్ కే కాదు ప్రతి టెక్నీషియన్ కు కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తర్వాతి సినిమాకి రెమ్యునరేషన్ ఎలా పెంచుకుందామనే చూస్తుంటారు. అయితే యంగ్ హీరో శ్రీ విష్ణు మాత్రం సినిమా హిట్ అయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో ఏం ఆలోచించలేదట. ముందు సినిమాకు తీసుకున్నదే తర్వాతి చిత్రాలకు కూడా తీసుకుంటున్నాడట. ఇలా చేయడానికి మనోడికి రీజనింగ్ కూడా ఉంది.

- Advertisement -

శ్రీ విష్ణు ఎంత టాలెంట్ ఉన్న నటుడన్నది మనమందరం చూసాం. అతని టాలెంట్ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేకపోయినా సోలో హీరోగా ఇంకా శ్రీ విష్ణు మార్కెట్ ను విస్తరించుకోలేదు. ఇప్పటిదాకా ఎక్కువగా సటిల్ గా ఉండే పాత్రలే చేస్తూ వచ్చాడు. అయితే తొలిసారి తన ఇమేజ్ ను దాటి చేస్తున్న ప్రయత్నం తిప్పరా మీసం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. మందు, డబ్బు, అమ్మాయిలులా శత్రువు కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే అని శ్రీ విష్ణు పలికే సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్ర థీమ్ ను ఆ డైలాగ్ తెలియజేస్తోంది. చాలా రా అండ్ ఇంటెన్స్ గా ఈ చిత్రాన్ని తీసారని అర్ధమవుతోంది. రిలీజ్ రేపే కాబట్టి శ్రీ విష్ణు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా తన రెమ్యునరేషన్ టాపిక్ రాగా బ్రోచేవారెవరురా సినిమా హిట్ అయినా కానీ తన రెమ్యునరేషన్ ను పెంచలేదట. దీనికి కారణం ముందున్న కమిట్మెంట్స్ అని చెప్తున్నాడు శ్రీ విష్ణు. బ్రోచేవారెవరురా రిలీజ్ కు ముందే మూడు సినిమాలకు కమిట్ అయ్యాను. ఇప్పుడు సినిమా హిట్ అయింది కదా అని రెమ్యునరేషన్ ను పెంచలేను. పైగా ఈ చిత్రాల నిర్మాతలు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అందుకే ఒప్పందం జరిగాక కూడా పెంచలేకపోయా. అయితే ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాక రెమ్యునరేషన్ విషయంలో ఆలోచిస్తా అని చెప్తున్నాడు శ్రీ విష్ణు.

అయితే ఇక్కడో లాజిక్ ఉంది. సినిమా హిట్ అయితేనే పారితోషికం పెంచడానికి ఎవరైనా ఒప్పుకునేది. మూడు సినిమాలు చేసాక పెంచుతాను అంటే అప్పుడు నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి కదా. సినిమా హిట్ అయితే ఓకే, ఒకవేళ ప్లాప్ అయితే మళ్ళీ ఇదే పారితోషకానికి చిత్రాలు చేయాల్సి ఉంటుంది. అతి మంచితనానికి పోయి శ్రీ విష్ణు మంచి అవకాశాన్ని వదిలేసుకున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts