Homeటాప్ స్టోరీస్కరోనా పై అవగాహన - రఘు కుంచె “మహమ్మారి” సాంగ్

కరోనా పై అవగాహన – రఘు కుంచె “మహమ్మారి” సాంగ్

కరోనా పై అవగాహన - రఘు కుంచె “మహమ్మారి” సాంగ్
కరోనా పై అవగాహన – రఘు కుంచె “మహమ్మారి” సాంగ్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారులను మరియు సాంస్కృతిక కళా రూపాల ప్రదర్శించే నటులను, కవులను ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా పాటలు పద్యాలు కవితలు రూపొందించి ప్రజలను చైతన్యవంతం చేయమని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నటీ నటులు చాలామంది ఇప్పటికే తమ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం మరియు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే విధంగా పోస్టులు పెడుతున్నారు.

ఇక సంగీత దర్శకులు మరియు గాయనీ గాయకులు సైతం సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా పాటలు తయారు చేసి విడుదల చేస్తున్నారు. ఇక ఆ జాబితాలో గాయకుడు సంగీత దర్శకుడు మరియు బహుముఖప్రజ్ఞాశాలి రఘు కుంచె గారు కూడా చేరారు. “చెప్పిన మాట వినకుంటే ఓరి నాయనా…! సంక నాకి పోతావ్ ఓరి నాయనా…!” అంటూ కరోనా వైరస్ పై అవగాహన కలిగించే పాటను చాలా తేలిక పదాలతో మరియు వినోదాత్మకంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపొందించారు.

- Advertisement -

ఈ పాటకు రామ్ గోపాల్ వర్మ గారి ఆస్థాన గీత రచయిత సిరాశ్రీ గారు లిరిక్స్ అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట బాగా పాపులర్ అవుతోంది ముఖ్యంగా యువత ఈ పాటకు సంబంధించిన సేల్ఫీవీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ విభిన్నంగా ఉండే రఘు కుంచే గారి గాత్రం.ఇలాంటి పరిస్థితుల్లో కూడా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న కళాకారుల కృషి అభినందనీయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All