Homeటాప్ స్టోరీస్కె.రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు పెళ్లైపోయింది!

కె.రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు పెళ్లైపోయింది!

కె.రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు పెళ్లైపోయింది!
కె.రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు పెళ్లైపోయింది!

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రారావు మాజీ కోడ‌లు, ర‌చ‌యిత‌ క‌నికా థిల్లాన్ పెళ్లైపోయింది. బాలీవుడ్ స్క్రీన్ రైట‌ర్ హిమాన్షు శర్మను సోమ‌వారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేగుక చాలా నిరాడంబ‌రంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు.

వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ని  కనికా థిల్లాన్, హిమాన్షు శర్మ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా నెటిజ‌న్‌ల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. కనికా థిల్లాన్‌,  హిమాన్షుశ‌ర్మ‌ గత సంవత్సరం డేటింగ్ ప్రారంభించారు. అంతే కాకుండా వారిపై వ‌స్తున్న వార్త‌ల్ని నిజం చేస్తూ గత ఏడాది జూన్‌లో త‌మ‌ సంబంధం గురించి ప్రకటించారు.

- Advertisement -

ఆ త‌రువాత ఇరు కుటుంబాల అంగీకారంతో డిసెంబర్ 14 న నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోల‌ని ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేయ‌డంతో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్త‌ల బ‌య‌టికి వ‌చ్చింది. తాజాగా పెళ్లి చేసుకున్న విష‌యాన్ని కూడా క‌నిక‌, హిమాన్షుశ‌ర్మ ప్ర‌క‌టించారు. ఈ ఫొటోల‌తో పాటు కనికా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పెళ్లి చిత్రాలను పంచుకుంది. ‘ఇదిగో # 2021 # newbeginnings #himanshusharma.’ అంటూ షేర్ చేసింది. కనికా థిల్లాన్ ఇంతకు దర్శకుడు కె రాఘవేంద్రరావు త‌న‌యుడు సూర్య ప్రకాష్ ను వివాహం చేసుకుని ఆ తరువాత విడిపోయిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All