Homeటాప్ స్టోరీస్రాఘ‌వేంద్రుడిని క్ష‌మాప‌ణ కోరిన పూరి!

రాఘ‌వేంద్రుడిని క్ష‌మాప‌ణ కోరిన పూరి!

రాఘ‌వేంద్రుడిని క్ష‌మాప‌ణ కోరిన పూరి!
రాఘ‌వేంద్రుడిని క్ష‌మాప‌ణ కోరిన పూరి!

టైమ్ ఎవ‌రిని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అందుకే ఎవ‌రినీ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. అలా అంచ‌నా వేస్తే ఆ త‌రువాత చేసిన త‌ప్పుకు క్ష‌మాప‌ణ చెప్పుకోవాల్సి వ‌స్తుంది. స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశ‌మే అనుష్క 15 ఏళ్ల ప్ర‌యాణం వేడుక‌లో చోటు చేసుకుంది. `సూప‌ర్‌` సినిమాతో టాలీవుడ్‌లో అనుష్క జ‌ర్నీ మొద‌లైంది. ఈ సినిమా డేట్స్ కోసం ఓ రోజు హీరో నాగార్జున డేట్స్ కావాల‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లోని నాగ్‌కాటేజీకి పూరి వ‌చ్చార‌ట‌. అదే స‌మ‌యంలో అక్క‌డ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేద్ర‌రావు వుండ‌టం చూసి ఏంటీ సార్ ఇలా వ‌చ్చారని పూరి అడిగితే నాగ్ డేట్స్ కోసం వ‌చ్చాన‌ని రాఘ‌వేంద్రారావు చెప్పార‌ట‌.

`ఎప్పుడో నా చిన్న‌ప్పుడు 5వ త‌ర‌గ‌తిలో మీరు తీసిన `అడ‌విరాముడు` చూశాను. ఇంకా ఎందుకు సార్ రిటైర్ కండి` అన్నార‌ట పూరి. దానికి రాఘ‌వేంద్ర‌రావు చిన్న‌గా న‌వ్వి పూరి భుజం త‌ట్టార‌ట‌. ఆ త‌రువాత నాగ్ ఇద్ద‌రికీ డేట్స్ ఇవ్వ‌డంతో పూరి `సూప‌ర్` సినిమా తీశారు. కొన్ని నెల‌ల విరామం త‌రువాత రాఘ‌వేంద్ర‌రావు `శ్రీ‌రామ‌దాసు` తీశారు. పూరి తాను తీసిన సూప‌ర్ తుస్సుమంద‌ని, కానీ రాఘ‌వేంద్ర‌రావు తీసిన `శ్రీ‌రామ‌దాసు` సూప‌ర్ హిట్ అయింద‌ని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఈ విష‌యంలో త‌న అజ్ఞానాన్ని, తొంద‌ర‌పాటు త‌ననాన్ని క్ష‌మించ‌మ‌ని గురువారం రాత్రి జ‌రిగిన వేదిక సాక్షిగా పూరి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రారావు కాళ్లు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌లువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌ని గుర్తుపెట్టుకుని పూరి త‌న‌ని క్ష‌మించ‌మ‌ని రాఘ‌వేంద్రావుని కోర‌టం అక్క‌డున్న వారిని చిన్న‌పాటి భావోద్వేగానికి గుర‌య్యేలా చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All