Homeటాప్ స్టోరీస్విజయ్ - పూరిల సినిమా 40 రోజుల షూటింగ్

విజయ్ – పూరిల సినిమా 40 రోజుల షూటింగ్

విజయ్ - పూరిల సినిమా 40 రోజుల షూటింగ్
విజయ్ – పూరిల సినిమా 40 రోజుల షూటింగ్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ పరంగా లో ఫేజ్ లో ఉన్నాడు. రీసెంట్ గా మన రౌడీ హీరో చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. లాస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ అయితే దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ప్రస్తుతం చేస్తోన్న పూరి జగన్నాథ్ సినిమాపైనే పెట్టాడు. పూరి జగన్నాథ్ కూడా ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

జెట్ స్పీడ్ వేగంతో షూటింగ్ లను పూర్తి చేసే పూరి, ఈ సినిమాకు మాత్రం కావాల్సినంత టైమ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికి ఈ సినిమా 40 రోజుల వర్కింగ్ డేస్ ను పూర్తి చేసుకుంది. ఈ 40 రోజులలో రెండు అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. అలాగే పలు సీన్లను కూడా షూట్ చేసారు.

- Advertisement -

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే రమ్య కృష్ణ, అలీ, రోనిత్ రాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. మరికొన్ని రోజులు ఈ చిత్ర షూటింగ్ ముంబైలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరమ్మాయిలతో చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన కిచ్చ ఈ సినిమాకు కూడా స్టంట్ మాస్టర్ గా వ్యవహరించనున్నాడు. చాలా స్టైలిష్ గా, హాలీవుడ్ లెవెల్లో స్టంట్ లు ఉంటాయని తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ తో పాటు ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగుతో పాటు ఈ చిత్రం తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర హిందీ వెర్షన్ కు విజయ్ దేవరకొండ స్వయంగా డబ్బింగ్ చెప్పబోతుండడం విశేషం.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ విడుదల చేయనున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All