
వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న వారిలో చాలా మంది పేర్లు సొంత పేర్లు కాదు. రియల్ నేమ్ వేరుంటే తెరపై మరో పేరుతో పాపులర్ అయిన వారు చాలా మందే వున్నారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. స్క్రిన్ నేమ్ చిరంజీవిగా మార్చారు. కలెక్షన్‌కింగ్ అసలు పేరు భక్త వత్సలం నాయుడు.. దాసరి ఆయన పేరుని మోహన్‌బాబుగా మార్చారు. పవన్‌కల్యాణ్ అసలు పేరు కల్యాణ్. తొలి సినిమా తరువాత పవన్ కల్యాణ్‌గా మార్చారు. శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు.. వెండితెరపైకి వచ్చేసరికి ఆయన పేరుని శోభన్‌బాబుగా మార్చారు.
వీరందరి తరహాలోనే స్వీటీని అనుష్కగా మార్చారు. దీని వెనకున్న స్టోరీని దర్శకుడు పూరిజగన్నాథ్ తాజాగా వెల్లడించారు. అనుష్క 15ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా `నిశ్శబ్దం` చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనుష్కతో సినిమాలు చేసిన దక్శకనిర్మాతలు పాల్గొన్నారు. 15 ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా `సూపర్` చిత్రాన్ని పూరి తెరకెక్కించాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం బాంబే వెళ్లాడట పూరి. అక్కడే అనుష్కని చూసి పిల్ల భలే వుంది. అని సినిమా కోసం అడిగితే తనకు నటన రాదని, డ్యాన్సు కూడా తెలియదని, ఇప్పటి నుంచి ట్రైచేయాలని చెప్పిందట. ఏంటీ పిల్ల బాగుందంటే ఇన్ని ట్విస్టులిస్తోంది. అని భావించిన పూరి సరే అని హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి తీసుకొచ్చి నాగార్జునకు చూపించారట.
అమ్మాయి డాగుంది ఆడిషన్ అవసరం లేదు అని చెప్పారట. అమ్మాయి బాగుంది కానీ ప్రతీ దానికి తెలియదు.. తెలుసుకోవాలి అంటొంది ఆడిషన్ చేస్తే బాగుందని నాగ్‌తో పూరి చెప్పి ఆడిషన్ చేశారట.
వినోద్ బాల వద్ద యాక్టింగ్ నేర్పించిన తరువాతే స్వీటీని `సూపర్` కోసం సెలెక్ట్ చేసుకున్నారట. అయితే తెరపై స్వీటి అని కాకుండా ఏదైనా కొత్త పేరు పెడదామని నాగ్, పూరి ఆలోచిస్తున్న సమయంలో `వి` ఛానల్ యాంకర్ అనుష్క కనిపించడంతో ఆ పేరునే స్వీటీకి పెట్టేశారట. దాంతో అసలు పేరుని పక్కన పెట్టి స్వీటీ అనుష్కలా మారిపోయింది. అంటే ఈ జేజమ్మ పేరు వెనక ఇంత పెద్ద స్టోరీ వుందన్నమాట.