Homeటాప్ స్టోరీస్కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కృష్ణ‌మోహ‌న్‌రావు క‌న్నుమూత‌!‌

కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కృష్ణ‌మోహ‌న్‌రావు క‌న్నుమూత‌!‌

కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కృష్ణ‌మోహ‌న్‌రావు క‌న్నుమూత‌!‌
కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కృష్ణ‌మోహ‌న్‌రావు క‌న్నుమూత‌!‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు, నిర్మాత, ఆర్‌.కె. ఫిలింస్ అధినేత కె. కృష్ణ‌మోహ‌న్‌రావు బుధ‌వారంహైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ లోని ఆయ‌న నివాసంలో క‌న్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయ‌న బుధ‌వారం తుది శ్వాస విడిచారు. కృష్ణ మోహన్ అంత్య క్రియ‌లు  ఫిల్మ్‌నగర్ లోని మహాప్రస్థానంలో జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

కృష్ణ మోహన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయ‌న మృతి చెందిన విష‌యం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు కృష్ణ‌మోహ‌న్‌రావు కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఆర్కె ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో కృష్ణ మోహన్ చాలా సినిమాలు నిర్మించారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవితో యుద్ధ భూమి, ఇద్ద‌రు మిత్రులు, బాల‌కృష్ణ‌తో అపూర్వ స‌హోద‌రులు, పాండురంగ‌డు, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబుతో అల్ల‌రి మొగుడు, డా. రాజ‌శేఖ‌ర్‌తో `అల్ల‌రి ప్రియుడు`, కింగ్ నాగార్జున‌తో `ఘ‌రానా బుల్లోడు`, విక్ట‌రీ వెంక‌టేష్‌తో `ముద్దుల ప్రియుడు`, జేడీ చ‌క్ర‌వ‌ర్తితో `బొంబాయి ప్రియుడు`,  సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘బాబీ’  వంటి చిత్రాల్ని నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All