Homeటాప్ స్టోరీస్లారెన్స్ ఎందుకు మౌనంగా వున్నారు?

లారెన్స్ ఎందుకు మౌనంగా వున్నారు?

లారెన్స్ ఎందుకు మౌనంగా వున్నారు?
లారెన్స్ ఎందుకు మౌనంగా వున్నారు?

ఆప‌న్నుల‌కు అండ‌గా వుండ‌టాన్ని ఓ సామాజిక బాధ్య‌త‌గా భావిస్తుంటారు రాఘ‌వ లారెన్స్‌. గ‌త కొంత కాలంగా అనాథ‌ల్ని, దివ్యాంగుల్ని అక్కున చేర్చుకుని వారికి అండ‌గా నిలుస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోనూ ఓ సేవా సంస్థ‌ని ప్రారంభించారు కూడా. దీనికి మెగాస్టార్ చిరంజీవి 10 ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయాన్ని కూడా అందించారు. ఇదిలా వుంటే రాఘ‌వ లారెన్స్ సోద‌రుడు వినోద్ త‌న‌ని వేధిస్తున్నాడ‌ని. త‌నని చంపేస్తాన‌ని బెదిరిస్తున్నాడ‌ని జూనియ‌ర్ ఆర్టిస్ట్ దివ్య మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

త‌న‌ని లైంగికంగా వేధిస్తున్న వినోద్ చీక‌టి దందా న‌డిపిస్తున్నాడ‌ని. త‌న‌ని ఆ కూపంలోకి లాగాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. వినోద్ చేస్తున్న అక్ర‌మాలు త‌న‌కు తెలుసు కాబ‌ట్టే త‌న‌ని హ‌త్య చేయాల‌నుకుంటున్నాడ‌ని హైద‌రాబాద్ వెస్ట్ జోన్ పోలీసుల‌కు దివ్య ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

అయితే దీనిపై రాఘ‌వ లారెన్స్ మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు వెంట‌నే సోష‌ల్ మీడియా ద్వారా కౌంట‌ర్ ఇచ్చే రాఘ‌వ లారెన్స్ జూనియ‌ర్ ఆర్టిస్ట్ దివ్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై మౌనంగా వుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్ప‌టికైనా లారెన్స్ మౌనం వీడాల‌ని, దివ్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All