
రాఘవ లారెన్స్ గత కొన్నేళ్లుగా సామాజిక సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దివ్యాంగులతో పాటు ఎలాంటి ఆధారం లేని అనాధల్ని చేరదీసి అక్కున చేర్చుకుంటున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవే దైవంగా కృషి చేస్తున్న రాఘవలారెన్స్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంఆ మారింది.
ఎంతో కాలంగా తాను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులు, పలువురు రాజకీయ నాయకులు తనని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని, రాజకీయాల్లోకి వస్తే ఇంతకు మించి సేవ చేయోచ్చని చెబుతున్నారని వారికి శుభ వార్త చెబుతున్నానని ప్రకటించిన లారెన్స్ తను రజనీ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.
ఇంత వరకు బాగానే వుంది. తాజాగా తాను రజనీ పార్టీలో చేరాలంటే సీఎం అభ్యర్థిగా రజనీ తప్ప మరొకరు వుండకూడదని కండీషన్ పెడుతున్నారట. ప్రస్తుతం ఈ అంశం తమిళ నాట చర్చనీయాంశంగా మారింది. రజనీ తాను పార్టీ పెడితే సీఎం అభ్యర్థిగా తాను వుండనని, ఆ స్థానంలో మరొకరిని పెడతానని చెప్పారు. ఇప్పడు అదే మాటని వెనక్కి తీసుకోమని, సీఎం అభ్యర్థిగా రజనీ వుంటేనే తాను పార్టీలో చేరతానని లారెన్స్ కొత్త మెళిక పెట్టడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.