Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!
ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న రొమాంటిక్ పిరియాడిక్ డ్రామా `రాధేశ్యామ్‌`పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఒత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. రాధాకృష్ణ కుమార్  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామా ఫ‌స్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా టీమ్‌తో చిన్న‌పాటి యుద్ధ‌మే చేశారు. ఫ‌స్ట్ లుక్ ఇంత ఆల‌స్యం చేస్తున్నారంటూ టీమ్ మెంబ‌ర్స్‌ని ఓ ద‌శ‌లో ట్రోల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఫ్యాన్స్ ఒత్తిడి భ‌రించ‌లేక‌పోయిన మేక‌ర్స్ చివ‌రికి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ‌స్ట్ లుక్‌ని ఎందుకు విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామో వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాత అదే తంతు టీజ‌ర్ విష‌యంలోనూ పున‌రావృతం అవుతోంది. టీజ‌ర్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ మేక‌ర్స్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీసినంత ప‌ని చేశారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.

- Advertisement -

దీంతో ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ టీజ‌ర్ త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోతున్నామంటే ప్ర‌క‌టించారు. టీజ‌ర్ అప్ డేట్ వ‌చ్చేస్తోంది. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్ రాబోతోంది. ఓపిక ప‌ట్టండి. మీ ఎదురుచూపుల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో టీజ‌ర్ వుంటుంద‌ని ప్రామిస్ చేస్తున్నాను` అని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ ట్విట్ట‌ర్  వేదిక‌గా వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All