Homeటాప్ స్టోరీస్2021 `రాధేశ్యామ్‌` నామ సంవ‌త్స‌ర‌మేనా!

2021 `రాధేశ్యామ్‌` నామ సంవ‌త్స‌ర‌మేనా!

2021 `రాధేశ్యామ్‌` నామ సంవ‌త్స‌ర‌మేనా!
2021 `రాధేశ్యామ్‌` నామ సంవ‌త్స‌ర‌మేనా!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్నరొమాంటిక్ ల‌వ్‌స్టోరీ `రాధేశ్యామ్‌`. ఈ మూవీ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి హాట్ టాపిక్‌గా మారి ట్రెండింగ్ అవుతోంది. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. క్రేజీ లేడీ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్‌ క్రియేట్ చేసింది.

ఈ స్టిల్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా?  అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఈ మూవీ పోస్ట‌ర్స్ అత్య‌ధికంగా సెర్చ్ చేసిన పోస్టర్స్‌గా రికార్డు సృష్టిస్తున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ నుంచి తాజాగా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా హీరో ప్ర‌భాస్‌, హీరోయిన్ పూజా హెగ్డే కొత్త పోస్ట‌ర్స్‌ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేశారు. బ్లాక్ డ్రెస్‌లో క్యాప్ పెట్టుకుని న‌వ్వుతూ క‌నిపిస్తున్న డార్లింగ్ ప్ర‌భాస్ స్టిల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

- Advertisement -

ఈ ఏడాది నా ప్రియ‌మైన అభిమానుల‌కు మ‌రింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాల‌ని ఆశిస్తున్నాను. రాధేశ్యామ్‌తో ఈ ఏడాది మీ ముందుకు వ‌చ్చేస్తున్నాను` అని ప్ర‌భాస్ త‌న అభిమానుల‌ని విష్ చేశారు. హీరోయిన్ పూజా హెగ్డే కూడా `అతను మీ హృదయాలను గెలుచుకోవటానికి వస్తున్నాడు. మిమ్మల్ని మళ్లీ ప్రేమలో పడేలా చేస్తాడు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! 2021 విత్‌రాధేష్యామ్` అని ట్వీట్ చేసింది. పిరియాడిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. ఓవ‌రాల్‌గా ఈ మూవీ గ్రాండీయ‌ర్‌.. నేప‌థ్యం‌.. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌, ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల మెస్మ‌రైజింగ్‌ కెమిస్ట్రీ చూస్తుంటే 2021లో రాధేశ్యామ్ హిస్ట‌రీ క్రియేట్ చేసేలా క‌నిపిస్తోంది. 2021 `రాధేశ్యామ్‌` నామ సంవ‌త్స‌ర‌మేనా అనిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All