Saturday, October 1, 2022
Homeగాసిప్స్ప్ర‌భాస్ `స‌లార్‌`లో బాలీవుడ్ హాట్ లేడీ?

ప్ర‌భాస్ `స‌లార్‌`లో బాలీవుడ్ హాట్ లేడీ?

ప్ర‌భాస్ `స‌లార్‌`లో బాలీవుడ్ హాట్ లేడీ?
ప్ర‌భాస్ `స‌లార్‌`లో బాలీవుడ్ హాట్ లేడీ?

బాహుబ‌లి, సాహో చిత్రాల‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. దీంతో ఆయ‌న‌తో సినిమాలు నిర్మించ‌డానికి ఇత‌ర భాష‌ల‌కు చెందిన ద‌ర్శ‌‌క‌నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌భాస్ న‌టించే చిత్రాలు వుండ‌టంతో బాలీవుడ్ హీరోయిన్ లు కూడా ప్ర‌భాస్‌తో న‌టించేందుకు పోటీప‌డుతున్నారు. `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ `స‌లార్‌` చిత్రంలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఇటీవ‌లే ఈ చిత్రాన్ని మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్ర‌భాస్ కొత్త త‌ర‌హా పాత్ర‌లో ర‌గ్గ్‌డ్ లుక్‌లో న‌టించ‌నున్న ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిషా ప‌టాని న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, దిషా ప‌టాని మేక‌ర్స్ ఇచ్చిన ఆఫ‌ర్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన అత్య‌ధిక భాగం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌లో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ రెండు న‌గ‌రాల్లో కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ప్లాన్ ప్ర‌కారం నాలుగు నెల‌ల్లో చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి చేసి మూవీని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `రాథేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts