
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. టీమ్ మెంబర్స్ కు కరోనా సోకడంతో ఏప్రిల్ ఆఖరి వారంలో పుష్ప షూటింగ్ నిలిచిపోయింది. తిరిగి ఇప్పుడు మూడు నెలల తర్వాత షూటింగ్ మొదలుకానుంది. తెలంగాణలో కేసులు తక్కువుండడంతో షూటింగులు చేసుకోవడానికి కొంత అనువుగా ఉంది. ఒక్కో చిత్రం ఒకటి తర్వాత ఒకటి సెట్స్ కు వెళ్తున్నాయి.
పుష్ప లేటెస్ట్ షెడ్యూల్ కూడా జులై 5 నుండి మొదలవుతుంది అని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే చైనా లేదా థాయిలాండ్ లో నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది. పుష్ప రెండు భాగాల్లో విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా తెలియజేసిన విషయం తెల్సిందే.
ఈ ఏడాది మొదటి పార్ట్ విడుదలవుతుంది. 2023లో సెకండ్ పార్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు మధ్యలో అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. ఐకాన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.