
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్ని చేస్తాడా అని రూమర్స్ బాగా షికార్లు చేసాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ చిత్రాన్ని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయితే ఆ చిత్రం కాకుండా అల వైకుంఠపురములో చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చేస్తున్నాడు.
ఐకాన్ ఇక అటకెక్కినట్లే అని అందరూ భావించారు. దానికి తోడు దిల్ రాజు క్యాంప్ నుండి వేణు శ్రీరామ్ బయటకు వచ్చేస్తున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలతో బిజీగా మారిపోయాడు. పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ ఉంది.
అయితే ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది. పుష్ప ఫస్ట్ పార్ట్ కు సెకండ్ పార్ట్ కు మధ్య గ్యాప్ ఉంటుందిట. ఇంకా కొంచెం స్క్రిప్ట్ వర్క్ మిగిలిందని అంటున్నారు. ఆ గ్యాప్ లో బన్నీ ఐకాన్ చేయాలని డిసైడ్ అయ్యాడట. పుష్ప మొదటి భాగం విడుదలయ్యాక ఐకాన్ ను చేసి మళ్ళీ పుష్ప 2 చేస్తాడట.