Homeటాప్ స్టోరీస్పుష్ప: శ్రీవల్లి పోస్టర్ తో రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారుగా

పుష్ప: శ్రీవల్లి పోస్టర్ తో రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారుగా

పుష్ప: శ్రీవల్లి పోస్టర్ తో రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారుగా
పుష్ప: శ్రీవల్లి పోస్టర్ తో రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారుగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రంపై బజ్ భారీ స్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ చిత్రీకరణ ఇప్పుడు చివరి దశలో ఉంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న పుష్పలో హీరోయిన్ గా నటిస్తోంది. పుష్పకు సంబంధించి అంతా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈరోజు రష్మిక మందన్న లుక్ ను కూడా విడుదల చేసారు. ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది రష్మిక. ఆమె లుక్ కూడా ఆసక్తికరంగా ఉంది. చీర, మల్లె పూలు ఎదురుగా పెట్టుకుని, రష్మిక రెడీ అవుతోన్న పిక్చర్ ను విడుదల చేసారు.

- Advertisement -

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రం ఉంటుందన్న విషయం తెల్సిందే. పుష్ప ది రైజ్ క్రిస్మస్ కు విడుదల కానుంది. వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చినా అదే రిలీజ్ డేట్ కు స్టిక్ అయ్యారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All