Homeటాప్ స్టోరీస్వచ్చే నెల పుష్ప సెకండ్ సింగిల్ రిలీజ్

వచ్చే నెల పుష్ప సెకండ్ సింగిల్ రిలీజ్

pushpa second single release in september
pushpa second single release in september

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. తన లాస్ట్ చిత్రం అల వైకుంఠపురములో కి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే పద్దతిలో తన రాబోయే చిత్రం పుష్ప ది రైజ్ కు ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేసారు.

పుష్ప ది రైజ్ లో మొదటి సింగిల్ దాక్కో దాక్కో మేకను కొన్ని రోజుల క్రితం విడుదల చేసారు. ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్, సాంగ్ లోని ఇంటెన్సిటీ అందరికీ తెగ నచ్చేసింది. పుష్పకు మంచి ప్రమోషనల్ స్టార్ట్ లభించింది. ఇక ఇక్కడి నుండి డిసెంబర్ లో సినిమా విడుదలయ్యే వరకూ నెలకు ఒక సాంగ్ ను విడుదల చేయనుంది పుష్ప టీమ్.

- Advertisement -

దాక్కో దాక్కో మేక వంటి ఇంటెన్స్ సాంగ్ తర్వాత ఈసారి డ్యూయెట్ ను రిలీజ్ చేస్తారు. ఈ సాంగ్ ను సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All