Homeటాప్ స్టోరీస్పుష్ప షూట్ లో పాల్గొననున్న మలయాళం సూపర్ స్టార్

పుష్ప షూట్ లో పాల్గొననున్న మలయాళం సూపర్ స్టార్

పుష్ప షూట్ లో పాల్గొననున్న మలయాళం సూపర్ స్టార్
పుష్ప షూట్ లో పాల్గొననున్న మలయాళం సూపర్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్, సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాక్కో దాక్కో మేక సాంగ్ హీరో పాత్ర చిత్రణకు దగ్గరగా ఉందని అర్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఫాజిల్ పుష్ప షూట్ లో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నాడు. ఆగస్ట్ 20 నుండి ఫహద్ ఉండే సీన్స్ ను చిత్రీకరిస్తారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ఇప్పటికే తెలియజేసారు.

- Advertisement -

పుష్ప మొదటి భాగం ది రైజ్ లో ఫహద్ పాత్ర పరిధి తక్కువగానే ఉంటుంది. ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ప్రయాణం ఆ ఏరియాను శాసించే దిశగా ఎలా ఎదిగింది అన్నది ఈ సినిమాలో ప్రధానంగా చూపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All