
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప బోలెడన్ని అంచనాలు క్యారీ చేస్తోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. పుష్ప రెండు భాగాలుగా విడుదలవుతోంది. మొదటి భాగం పుష్ప – ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. ఇక ఈరోజు ప్రమోషన్స్ లో భాగంగా మొదటి పాటను విడుదల చేసారు.
దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో ఆసక్తిని కలిగించింది. దానికి తగ్గట్లుగానే కొద్దిసేపటి క్రితం విడుదలైన ఫుల్ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా లిరిక్స్ అండ్ ట్యూన్ ఆకట్టుకుంటున్నాయి. సమాజంలో మనుగడ సాగించాలంటే ఏ జంతువుకైనా వేటాడడం తప్పదన్న ఐడియాలజీలో ఈ సాంగ్ ను రాసాడు రచయిత చంద్రబోస్. ఇక ట్యూన్ కూడా క్యాచీగా ఉండడంతో కచ్చితంగా చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది.
శివమ్ ఈ పాటను పాడగా తను కూడా పూర్తి న్యాయం చేసాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
