Homeటాప్ స్టోరీస్ఐకాన్ ప్రాజెక్ట్ పై మరోసారి దృష్టి పెట్టిన అల్లు అర్జున్

ఐకాన్ ప్రాజెక్ట్ పై మరోసారి దృష్టి పెట్టిన అల్లు అర్జున్

ఐకాన్ ప్రాజెక్ట్ పై మరోసారి దృష్టి పెట్టిన అల్లు అర్జున్
ఐకాన్ ప్రాజెక్ట్ పై మరోసారి దృష్టి పెట్టిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ గా ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను ప్రకటించాడు. అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వెనక్కి జరుగుతూ పోయింది. ఈలోగా బన్నీ అల వైకుంఠపురములో చేసాడు. ఆ తర్వాత పుష్ప మొదలుపెట్టాడు. ఇక దీంతో ఐకాన్ ఉండదనే అనుకున్నారంతా. కానీ దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. ఐకాన్ కచ్చితంగా ఉంటుందని తెలిపాడు.

ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలతో షూటింగ్ అయిపోతుంది. డిసెంబర్ లో పుష్ప మొదటి పార్ట్ ను విడుదల చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అక్టోబర్ నుండి ఐకాన్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. వచ్చే వారం దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ నరేషన్ ఇస్తాడు. అది కనుక బన్నీకి ఓకే అయితే ఇక ఐకాన్ పట్టాలెక్కేసినట్లే.

- Advertisement -

ప్యాన్ ఇండియా రేంజ్ లో ఐకాన్ ను నిర్మించాలని బన్నీ ఇప్పటికే దిల్ రాజుకు, వేణు శ్రీరామ్ కు సూచించాడు. దానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసాడు దర్శకుడు. ఐకాన్ అయ్యాక పుష్ప పార్ట్ 2 షూటింగ్ మొదలుపెడతాడు బన్నీ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All