
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో హీరోయిన్లను రిపీట్ చేయడానికి పెద్దగా ఇష్టపడడు. ఇప్పటిదాకా కేవలం పూజ హెగ్డే, క్యాథెరిన్ లతో మాత్రమే మరోసారి నటించాడు. ముఖ్యంగా పూజ హెగ్డేతో నటించిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలవడంతో హిట్ పెయిర్ గా నిలిచారు. మరోసారి వీరి జోడి రిపీట్ కాబోతోందని సమాచారం.
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డేకు సూపర్బ్ టైమ్ నడుస్తోంది. టాప్ హీరోలు అందరూ పూజనే కావాలి అంటున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ విడుదలైన తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డేను కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే తెలుస్తుంది. దిల్ రాజు ఐకాన్ ను భారీ బడ్జెట్ మధ్య నిర్మించనున్నాడు.