Homeటాప్ స్టోరీస్పుష్ప పార్ట్ 1 విడుదల తేదీ ఖరారు

పుష్ప పార్ట్ 1 విడుదల తేదీ ఖరారు

పుష్ప పార్ట్ 1 విడుదల తేదీ ఖరారు
పుష్ప పార్ట్ 1 విడుదల తేదీ ఖరారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కు దర్శకుడు సుకుమార్ అనారోగ్యం కారణంగా ఈ మధ్యే కొంత బ్రేక్ రాగా మళ్ళీ తిరిగి మొదలైంది. మరికొన్ని రోజుల్లో పుష్ప షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. నిన్ననే పుష్ప ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ వచ్చిన విషయం తెల్సిందే.

దాక్కో దాక్కో మేక సాంగ్ ను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నారు. పుష్ప ప్రమోషన్స్ మొదలవ్వడంతో సినిమా రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. దానికి తగ్గట్లుగానే పుష్ప రిలీజ్ డేట్ ఖరారైంది. డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ లో పుష్ప విడుదల కానుంది.

- Advertisement -

ఇది మొదటి భాగం మాత్రమే. దీన్ని పుష్ప ది రైజ్ గా పరిగణిస్తారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్పలో రష్మిక మందన్న హీరోయిన్. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All