
దర్శకుడు సుకుమార్ కు రీసెంట్ గా డెంగ్యూ జ్వరం రావడంతో పుష్ప షూటింగ్ కు బ్రేకులు పడిన విషయం తెల్సిందే. డాక్టర్ల పర్యవేక్షణలో ఇన్ని రోజులు ఉన్న సుకుమార్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా డెంగ్యూ లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో డాక్టర్ల సలహా మేరకు తిరిగి షూటింగ్ కు హాజరయ్యాడు.
నిన్నటి నుండి పుష్ప షూటింగ్ తిరిగి మొదలైంది. ఇంకా లైట్ గా నీరసం ఉందిట క్రియేటివ్ దర్శకుడికి. సుకుమార్ తో పాటు మరికొంత మంది క్రూ కు కూడా డెంగ్యూ లక్షణాలు కనిపించాయని అన్నారు. మరి వారి విషయంలో ఎటువంటి సమాచారం లేదు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 సమ్మర్ కు పుష్ప విడుదలవుతుందని అంటున్నారు. ఇంకా విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.