
మలయాళ టాప్ నటుడు ఫహద్ ఫాజిల్ వరస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. మలయాళం మాత్రమే కాకుండా తమిళ్, తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు. తమిళ్ లో కమల్ హాసన్ కు విలన్ గా విక్రమ్ సినిమాలో నటిస్తోన్న ఫహద్, తెలుగులో పుష్ప చిత్రంలో విలన్ గా చేస్తున్నాడు.
రీసెంట్ గా ఫహద్ నటించిన మాలిక్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. దీనికి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఫహద్ రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో పనిచేయడం గురించి స్పందించాడు. “నిజానికి సుకుమార్, నేను ఎప్పటినుండో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము. నేను రెగ్యులర్ గా సుకుమార్ సినిమాలు చూస్తుంటాను. ఆయన దర్శకత్వంలో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఫహద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
పుష్ప షూటింగ్ లో త్వరలోనే ఫహద్ ఫాజిల్ జాయిన్ కానున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెల్సిందే.