Homeగాసిప్స్మెగా స్టార్ వెర్సస్ ఐకాన్ స్టార్...ఢీ అంటే ఢీ

మెగా స్టార్ వెర్సస్ ఐకాన్ స్టార్…ఢీ అంటే ఢీ

మెగా స్టార్ వెర్సస్ ఐకాన్ స్టార్...ఢీ అంటే ఢీ
మెగా స్టార్ వెర్సస్ ఐకాన్ స్టార్…ఢీ అంటే ఢీ

కరోనా కారణంగా సినిమాల విడుదల తేదీలలో బోలెడంత కన్ఫ్యూజన్ నెలకొంది. ముఖ్యంగా భారీ చిత్రాలను ఎప్పుడు బరిలో ఉంచాలా అని నిర్మాతలు, దర్శకులు, టాప్ హీరోలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకరితో ఒకరికి క్లాష్ తప్పట్లేదు. సంక్రాంతికి ముగ్గురు టాప్ హీరోలు వస్తున్నారని తెలిసినా కానీ ఆర్ ఆర్ ఆర్ ను జనవరి 7న విడుదల చేయాలని నిర్ణయించాడు రాజమౌళి.

ఇక ఇప్పుడు మరో క్లాష్ కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప ది రైజ్ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు అదే డేట్ కు మెగాస్టార్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా డిసెంబర్ 17నే విడుదల చేయబోతున్నట్లు వినికిడి.

- Advertisement -

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపో ఎల్లుండో వస్తుందన్నది మెగా క్యాంప్ నుండి వస్తోన్న న్యూస్. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. ఎంత క్లాష్ తప్పకపోయినా ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం బాక్స్ ఆఫీస్ పరంగా కూడా అంత మంచిది కాకపోవచ్చు. ఏదైనా మరికొద్ది రోజులు ఆగితే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All