Homeగాసిప్స్అక్టోబర్ లో ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెట్టనున్న కొరటాల శివ

అక్టోబర్ లో ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెట్టనున్న కొరటాల శివ

అక్టోబర్ లో ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెట్టనున్న కొరటాల శివ
అక్టోబర్ లో ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెట్టనున్న కొరటాల శివ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరికొంత షూటింగ్ తప్ప ఆచార్య సినిమా మొత్తం పూర్తయింది. సెప్టెంబర్ లో బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తాడు కొరటాల శివ. ఇక ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా అక్టోబర్ నుండి ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతాడు.

- Advertisement -

మళ్ళీ డిసెంబర్ లో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఆచార్య ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయిస్తాడు. ప్రస్తుతానికైతే కొరటాల శివ ఈ రకంగా ప్లాన్ చేసుకున్నట్లు ప్రాధమికంగా తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసాడు. ఈ రెండు నెలలు తన సమయాన్ని ఎవరు మీలో కోటీశ్వరులు చిత్రం కోసం కేటాయించనున్నాడు ఎన్టీఆర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All