Homeటాప్ స్టోరీస్పునీత్ సినిమా విడుదలవుతుందా?

పునీత్ సినిమా విడుదలవుతుందా?

పునీత్ సినిమా విడుదలవుతుందా?
పునీత్ సినిమా విడుదలవుతుందా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నెం 1 హీరో అన్న విషయం తెల్సిందే. కేజిఎఫ్ తో కొన్ని లెక్కలు మారాయి కానీ పునీత్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్. కొన్ని నెలల క్రితమే పునీత్ నటించిన యువరత్న విడుదలై భారీ విజయం సాధించింది. అలాగే పునీత్ చనిపోక ముందు రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. కేజిఎఫ్ నిర్మాతలతో యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో పునీత్ సినిమా ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. దీన్ని వేరే హీరోతో చేసుకోవడం తప్ప మరో అవకాశం లేదు.

ఇక రెండో సినిమా జేమ్స్. ఈ చిత్ర టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసాడు పునీత్. ఒక సాంగ్, కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మిగిలున్నాయి కానీ వాటిని ఇక పక్కన పెట్టేయడమే. జేమ్స్ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే పునీత్ నటించిన చివరి సినిమా కావడంతో దాన్ని అలా వదిలేస్తారని అనుకోలేం.

- Advertisement -

కాకపోతే డబ్బింగ్ వేరే ఎవరితోనైనా చెప్పించాల్సి ఉంటుంది. తమ ఫెవరెట్ హీరోకు వేరే గొంతు అనేది ఫ్యాన్స్ కు మింగుడుపడని అంశమే కానీ కనీసం పునీత్ ను మరోసారి స్క్రీన్ పై చూసుకోవచ్చన్న ఆశ కూడా ఉంది. మార్చ్ 17న పునీత్ పుట్టినరోజు సందర్భంగా జేమ్స్ చిత్రాన్ని విడుదల చేయొచ్చని కన్నడ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All