Homeటాప్ స్టోరీస్బోయపాటితో స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్న కేజిఎఫ్ యష్

బోయపాటితో స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్న కేజిఎఫ్ యష్

boyapati srinu to direct kgf star yash
boyapati srinu to direct kgf star yash

కేజిఎఫ్ చాప్టర్ 1 తో నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు కన్నడ స్టార్ హీరో యష్. కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే యష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేద్దామని గత కొంత కాలంగా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తాడని తెల్సింది.

ఈ మధ్యే యష్, బోయపాటి మధ్య కొన్నిసార్లు చర్చలు జరిగాయట. యష్ కూడా బోయపాటి స్క్రిప్ట్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కోసం చూస్తోన్న యష్ తన నెక్స్ట్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇక బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండవచ్చు. కేజిఎఫ్ తరహాలో ఇది కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All