Homeఎక్స్ క్లూసివ్కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి

కర్ణాటక నాట తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈరోజు ఉదయం గుండె నొప్పి కారణంగా బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటి నుండి ఐసీయూలో చికిత్స పొందుతోన్న పునీత్ రాజ్ కుమార్ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు తెలుస్తోంది. పునీత్ కు 46 సంవత్సరాలు. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెనొప్పి రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసారు.

కొన్ని నిమిషాల క్రితమే పునీత్ రాజ్ కుమార్ చనిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. రాజ్ కుమార్ చిన్న కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్, చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ ఏడాది యువరత్న సినిమాతో సూపర్ హిట్ సాధించిన పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. జేమ్స్, ద్విత్వ.. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

- Advertisement -

ఈరోజే పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ నటించిన భజరంగి2 విడుదలైంది. అయితే దురదృష్టవశాత్తూ పునీత్ చనిపోవడంతో ఈరోజు, రేపు కర్ణాటక వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. థియేటర్లు మూసివేయాలని ఆదేశించారు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ ఈ వార్తతో డీప్ షాక్ లోకి వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీస్ పునీత్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All