
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. రానా దగ్గుబాటితో కలిసి పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఇటీవలే విడుదల చేసిన మేకింగ్ వీడియో ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్ర టైటిల్ పై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. టైటిల్ తో పాటు సినిమా టీజర్ ను కూడా వదుల్తారు. దీనికి ముహూర్తం ఖరారైంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేస్తారు.
నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.
Power Storm is all set to takeover with the Title & First Glimpse on 15th Aug from 09:45AM⚡
Get ready for the adrenaline rush ????????#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/SaqwNROqV7
— Sithara Entertainments (@SitharaEnts) August 13, 2021