Homeటాప్ స్టోరీస్ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండండి..! - కరోనా పై ప్రియదర్శి కామెంట్స్

ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండండి..! – కరోనా పై ప్రియదర్శి కామెంట్స్

ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండండి..! - కరోనా పై ప్రియదర్శి కామెంట్స్
ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండండి..! – కరోనా పై ప్రియదర్శి కామెంట్స్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది సినిమా ప్రముఖులు సెలబ్రెటీలు తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజికంగా దూరంగా ఉండటం ఎక్కువ శాతం వరకు ఇలాంటి వైరస్లను వ్యాప్తి చెందటానికి అరికడుతుందన్న విషయాన్ని సినిమా నటీనటులు వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.

దానిలో భాగంగా తెలుగు యువ హాస్యనటుడు ప్రియదర్శి తన సామాజిక మాధ్యమం ద్వారా ఒక వీడియో ని షేర్ చేశారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని అదేవిధంగా కొంతకాలం సామాజికంగా అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలను అభ్యర్థించారు. అదేవిధంగా మన “ఇల్లు ఇంటి చుట్టుపక్కల డోర్లు, కాలింగ్ బెల్ ఇలాంటి చోట్ల అనేక మంది వచ్చి వెళ్తూ తమ తమ చేతులతో తాకుతూ ఉంటారనీ.. అక్కడ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.!” అని తెలియజేశాడు. స్వయంగా తానే సానిటైజర్ లిక్విడ్ తీసుకొని ఇంటి డోర్ మీద మరియు కాలింగ్ బెల్ మీద, తలుపు గడియ మీద వేసి శుభ్రం చేశాడు. భారతదేశంలో ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ పాటిస్తున్నారని… కానీ మన తెలంగాణ ప్రభుత్వం సూచనమేరకు 24 గంటల పాటు అనగా ఆదివారం రేపు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ పాటించాలని మరొకసారి ప్రియదర్శి గుర్తుచేశాడు. కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న డాక్టర్లను, పారిశుద్ధ్య ఆరోగ్య వైద్య శాఖ సిబ్బందిని పోలీసు శాఖను అత్యవసర భాగాల  సేవలను ప్రియదర్శి కొనియాడుతూ ప్రజలందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Credit:Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All