Homeటాప్ స్టోరీస్కేజీఎఫ్ టీమ్‌తో చేతులు క‌లిపిన పృథ్వీరాజ్‌!

కేజీఎఫ్ టీమ్‌తో చేతులు క‌లిపిన పృథ్వీరాజ్‌!

కేజీఎఫ్ టీమ్‌తో చేతులు క‌లిపిన పృథ్వీరాజ్‌!
కేజీఎఫ్ టీమ్‌తో చేతులు క‌లిపిన పృథ్వీరాజ్‌!

క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్2`. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై డేరింగ్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో సంజ‌య్‌ద‌త్ అథీరాగా న‌టిస్తున్నారు.

ఇందిరా గాంధీ త‌ర‌హా పాత్ర‌లో ర‌మీకా సేన్‌గా ర‌వీనా టాండ‌న్ న‌టిస్తోంది. శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, మిందీ భాష‌ల్లో ఈ మూవీ ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ కోసం భారీ స్థాయిలో ఖ‌ర్చు చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ టీజ‌ర్ కోసం యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ నెల 8న హీరో య‌ష్ పుట్టిన కానుక‌గా ఈ చిత్ర టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా ఈ మూవీ టీమ్‌తో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ చేతులు క‌లిపారు. ఈ మూవీ మ‌ల‌యాళ వెర్ష‌న్ కేర‌ళ‌ డిస్ట్రీ బ్యూష‌న్ హ‌క్కుల్ని పృథ్వీరాజ్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత, హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.  ఇదే విష‌యాన్ని ట్విట్టర్ వేదిక‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్ వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All