Homeటాప్ స్టోరీస్`కేజీఎఫ్‌` నుంచి 21న బిగ్ స‌ర్‌ప్రైజ్‌!

`కేజీఎఫ్‌` నుంచి 21న బిగ్ స‌ర్‌ప్రైజ్‌!

`కేజీఎఫ్‌` నుంచి 21న బిగ్ స‌ర్‌ప్రైజ్‌!
`కేజీఎఫ్‌` నుంచి 21న బిగ్ స‌ర్‌ప్రైజ్‌!

క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సంచ‌ల‌నం సృష్టించింది. 2018 డిసెంబ‌ర్ 21న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డ‌మే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`ని తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో వుంది.

హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా వేసిన గోల్డ్ మైన్స్ గనుల్లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి సంబంధించిన స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 21న ఈ చిత్ర ఫ‌స్ట్ పార్ట్‌ని విడుద‌ల చేశారు. 20న ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ చేశారు. ఈ డేట్‌కి ప్ర‌త్యేక‌త వుండ‌టంతో అదే డేట్‌న స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని ఆడియ‌న్స్‌కి ఈ చిత్ర బృందం ఇవ్వ‌బోతోంది.

- Advertisement -

తొలి భాగం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో చాప్ట‌ర్ 2పై దేశ వ్యాప్తంగా అంచ‌నాలు పెరిగిపోయాయి. దీంతో చాప్ట‌ర్ 2 ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్ష‌కుల్లో చాప్ట‌ర్ 2పై నెల‌కొన్న అంచ‌నాల‌ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21న ఉద‌యం 10.08 నిమిషాల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ని అందించ‌బోతున్నార‌ట‌. అది య‌ష్ ఫ‌స్ట్ లుకేనా లేట టీజ‌ర్‌ని దించేస్తారా అన్న‌ది మాత్రం క్లారిటీ రావాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All