Homeటాప్ స్టోరీస్శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా `హౌస్ అరెస్ట్` స్టార్ట్‌!

శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా `హౌస్ అరెస్ట్` స్టార్ట్‌!

శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా `హౌస్ అరెస్ట్` స్టార్ట్‌!
శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా `హౌస్ అరెస్ట్` స్టార్ట్‌!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త త‌ర‌హాలో వుంటే విభిన్న‌మైన వినోదాత్మ‌క చిత్రాల్ని అందించాల‌ని ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించింది ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌. వినూత్న‌మైన చిత్రాల్ని అందిస్తూ అగ్ర‌శ్రేణి నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా పేరు తెచ్చుకోవాల‌న్న ల‌క్ష్యంతో సినిమాల నిర్మాణం మొద‌లుపెట్టింది. తాజాగా ఈ సంస్థ ప్రొడ‌క్ష‌న్ నెం.3 గా `హౌస్ అరెస్ట్‌` చిత్రాన్ని గురువారం ప్రారంభించింది. శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి ఇందులో హీరోలుగా న‌టిస్తున్నారు.

`90 ఎం.ఎల్‌` ఫేమ్ శేఖ‌ర్‌రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కె. నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభ‌మైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ సైతం నేటి నుంచే ప్రారంభించారు. శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరిల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ డైరెక్ట‌ర్ బాబి క్లాప్ నిచ్చారు.

- Advertisement -

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం, జె. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ, చోటా కె. ప్ర‌సాద్ ఎడిటింగ్,  చంద్ర‌బోస్ సాహిత్యం  అందిస్తున్నారు. అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాష్‌, సున‌య‌న ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All