Homeటాప్ స్టోరీస్టీవీ 9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్‌కు ఈడీ షాక్‌

టీవీ 9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్‌కు ఈడీ షాక్‌

టీవీ 9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్‌కు ఈడీ షాక్‌
టీవీ 9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్‌కు ఈడీ షాక్‌

టీవి 9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ( ఈడీ) గ‌ట్టి షాకిచ్చింది. ర‌విప్ర‌కాష్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ లో 2018 సెప్టెంబ‌ర్ నుంచి 2019 మే వ‌ర‌కు 18 కోట్ల నిధుల్ని ఎలాంటి అనుమ‌తులు లేకుండా తీసుకున్నార‌ని గతంలో 2019లో బంజారా హిల్స్ పోలీస్టేష‌న్‌లో ర‌విప్ర‌కాష్‌పై కేసు న‌మోదైంది. ‌దీని ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు క‌న్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ (ఈసీఐఆర్‌) న‌మోదు చేసింది.

దీని ఆధారంగా ర‌విప్ర‌కాష్‌కు స‌మ‌న్లు ఇచ్చి ఈడీ ప్ర‌శ్నించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఏసీబీకి సంబంధంచిన రూ. 18 కోట్ల స్కాం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌ల‌పై 2019 అక్టోబ‌ర్‌లో ర‌విప్ర‌కాష్‌ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఏబీసీపీఎల్ డైరెక్ట‌ర్ గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేయ‌డంతో ర‌విప్ర‌కాష్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేశారు. తాజాగా ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో ర‌విప్ర‌కాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంద‌ని అంటున్నారు.

- Advertisement -

2018లో అలంద మీడియా టీవీ 9లో మెజారిటీ షేర్లు కొనుగోలు చేసింది. అనుమానం వ‌చ్చి అకౌంట్‌లు ప‌రిశీలిస్తే తాజా స్కాం బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ఆ సంస్థ తెలిపింది. డైరెక్ట‌ర్లు, షేర్ హోల్డ‌ర్‌ల అనుమ‌తి లేకుండానే డ‌బ్బు తీశార‌ని ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. అరెస్టు స‌మ‌యంలో త‌న‌పై కావాల‌నే ఆరోప‌ణ‌లు చేశార‌ని వాదించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All