
ఈ నెల 12న రానా తనకు కాబోయే వైఫ్ ఈమేనంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ముంబైలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపనీనీ నర్వహిస్తున్న మిహిక బజాజ్‌ని తాను ప్రేమిస్తున్నానని, త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ రానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొనగా రానాకు, మిహికాకు నిశ్చితార్థం జరుగుతుందని వార్తలు వినిపించాయి.
దీనికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు బయటికి రాలేదు. ఇదిలా వుంటే రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి కామెంట్ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. `ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో రానా బావ ఎంగేజ్‌మెంట్. తరువాత నాదే` అంటూ ఫేస్ బుక్ వేదికగా కామెంట్ చేసింది. రానా తన ప్రేమ వ్యవహారం బయట పెట్టిన రోజే శ్రీరెడ్డి సెటైర్లు వేస్తుందని అంతా భావించారు. కానీ శ్రీరెడ్డి మాత్రం విమర్శలు కురిపించకుండా సైలెంట్ అయింది.
దీంతో అంతా శ్రీరెడ్డి సెటైర్లు వేయదని అనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ పంచ్ లు వేయడం మొదలుపెట్టింది. రానా ఎంగేజ్‌మెంట్ తరువాత తనదే అంటూ కామెంట్ చేసి దానికి కన్ను గీటుతున్న ఎమోజీని జోడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాస్టింగ్ కౌచ్, `మా`వివాదం సమయంలో శ్రీరెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మళ్లీ అలాంటి రచ్చకు తెరతీస్తుందా? అనే అనుమానం అందరిలోనూ మొదలైంది.