Homeటాప్ స్టోరీస్చిత్తుగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్

చిత్తుగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. బెంగుళూరు సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అంటూ ఆరు నెలల ముందే ప్రకటించాడు ప్రకాష్ రాజ్ . ఇక్కడ ప్రకాష్ రాజ్ కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా 30 వేలు. దాంతో ప్రకాష్ రాజ్ కు డిపాజిట్ కూడా దక్కలేదు.

నరేంద్ర మోడీ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన ప్రకాష్ రాజ్ తన స్నేహితురాలు గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డాడు. అయితే ప్రకాష్ రాజ్ కు ప్రచార సమయంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది . కానీ అది ఓట్ల రూపంలో లభించకపోవడంతో ఖంగుతిన్న ప్రకాష్ రాజ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే కౌంటింగ్ హాల్ నుండి వెళ్ళిపోయాడు. అంతేకాదు ఒడిపోయినప్పటికి పోరాట పంథా వీడేది లేదని స్పష్టం చేశాడు. తప్పకుండా గెలుస్తానని ఆశపడిన ప్రకాష్ రాజ్ ఓటమితో కుంగిపోయాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All