Homeటాప్ స్టోరీస్సెట్‌లో మోనార్క్ సంద‌డి మొద‌లైంది!

సెట్‌లో మోనార్క్ సంద‌డి మొద‌లైంది!

సెట్‌లో మోనార్క్ సంద‌డి మొద‌లైంది!
సెట్‌లో మోనార్క్ సంద‌డి మొద‌లైంది!

నేను మోనార్క్‌ని న‌న్నెవ‌రూ మోసం చేయ‌లేరంటూ త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్ర‌కాష్‌రాజ్. లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీల‌కు అండ‌గా నిలిచి ఆదుకున్న ఆయ‌న కొంత మందికి త‌న ఫామ్ హౌస్‌లో షెల్ట‌ర్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో ఫ్యామిలీతో క‌లిసి హైద‌రాబాద్ శివారులో వున్న ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైన ఆయ‌న తాజాగా సంద‌డి షురూ చేశారు.

ఇటీవ‌ల అనూహ్యంగా `కేజీఎఫ్ చాప్ట‌ర్‌2` సెట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి స‌ర్‌ప్రైజ్ చేసిన ప్ర‌కాష్‌రాజ్ ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు క్లారిటీ ఇచ్చారు. య‌ష్ హీరోగా తాజాగా ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్న `కేజీఎఫ్ 2`లో త‌నకు సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ప్ర‌కాష్‌రాజ్ సోమ‌వారం తెలుగు సినిమా సెట్‌లో సంద‌డి చేశారు.

- Advertisement -

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా సంతోష్ శ్రీ‌నివాస్ `అల్లుడు అదుర్స్‌` పేరుతో ఓ ఫ్యామిలీ ఎంర్‌టైన‌ర్‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. నూత‌న నిర్మాత నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది., ఇందులో ప్ర‌కాష్‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్‌రాజ్‌, సోనుసూద్‌ల‌పై కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్నారు. అనంత‌రం అను ఇమ్మాన్యుయేల్‌, న‌భా న‌టేష్ పాల్గొన‌గా పాట‌ల్ని చిత్రీక‌రిస్తార‌ట‌. సంక్రాంతికి చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All