Homeటాప్ స్టోరీస్`కేజీఎఫ్ 2` నుంచి అధీరా లుక్ వ‌చ్చేస్తోంది!

`కేజీఎఫ్ 2` నుంచి అధీరా లుక్ వ‌చ్చేస్తోంది!

`కేజీఎఫ్ 2` నుంచి అధీరా లుక్ వ‌చ్చేస్తోంది!
`కేజీఎఫ్ 2` నుంచి అధీరా లుక్ వ‌చ్చేస్తోంది!

క‌న్న‌డ ఫిల్మ్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. యష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అయ‌న్ని ఓవ‌ర్ నైట్‌లో పాన్ ఇండియా స్థాయి స్టార్‌ని చేసింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప‌రిస్థితీ అంతే. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం  వ‌సూళ్ల ప‌రంగానూ చ‌రిత్ర సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్‌2` రూపొందుతోంది.

తొలి భాగానికి మించి రెండ‌వ భాగం మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో వుండ‌బోతోంది. ఇందులో అధీరాగా కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్ ద‌త్ క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ధాన మంత్రి ర‌మికా సేన్ పాత్ర‌లో బాలీవుడ్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ క‌నిపించ‌నుంది. 20 శాతం మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని చిత్ర బృందం తాత్కాలికంగా ఆపేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు షూటింగ్స్‌కి అనుమ‌త‌లు మంజూరు చేసినా ప‌రిస్థితుల్లో మార్పులు రాక‌పోవ‌డంతో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` షూటింగ్ ఆగిపోయింది.

- Advertisement -

ఇదిలా వుంటే ఇందులో అధీరాగా న‌టిస్తున్న సంజ‌య్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేయ‌బోతోంది. సంజ‌య్ ద‌త్ పుట్టిన రోజు ఈ నెల 29న‌. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సంజ‌య్‌ద‌త్ ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఆ డేట్ మార‌డం ఖాయ‌మ‌ని క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All